Monday, May 3, 2010

తెలుగు వారిలో హామ్ లు

ఔత్సాహిక హామ్ శ్రీ రామ మోహనరావు, కాకినాడ, రెటైర్డ్ వైర్లెస్ అఫీసరు కాకినాడ పోర్ట్

తెలుగు వారిలో హామ్ లు చాలామంది ఉన్నారు. ఎక్కువగా, హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడతెనాలి, కాకినాడ వంటి చిన్న ఊళ్ళలలో కూడా ఉన్నారు. తెలుగు వారిలో చాలా మంది, తమ సొంత సెట్లు తయారు చేసుకొని బాండు (హామ్ పరిభాషలో ఈ హాబీలోకి వచ్చి ఇతరులతో సంభాషణ మొదలుపెట్టటం) లోకి వచ్చినవారే. సొంతంగా సెట్ తయారు చేసుకునేవారి సౌలభ్యంకోసం, RM96 అని ఒక సర్క్యూట్ బోర్డ్ VU2 NJS(శ్రీ సోక్రటీసు-ప్రస్తుతం వీరు కెనడాలో నివాసం) మరియు VU2 RM(శ్రీ రామమోహనరావు, కాకినాడ-బొమ్మలోని వారు) ఎంతగానో కృషి జరిపి 1996లో రూపొందించారు. ఈ బోర్డ్ వాడి అనేకమంది తమ తమ సెట్లు సొంతంగా చేసుకొని ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచేకాకుండా, యావత్ దక్షిణ భారత దేశంనుంచి ఔత్సాహిక హామ్ లు బాండ్ మీదకు వచ్చారు. లాంటి పట్టణాలలోనే కాకుండా,

[మార్చు] జనజీవనంలో హామ్ హాబీ

ప్రకృతి వైపరీత్యాలు- తుఫాన్లు, భూకంపాలు మొదలగునవి- సంభవించినప్పుడు, సాధారణ సమాచార సాధనాలు (ఫోన్లు, సెల్ ఫోన్లు)పనిచేయని పరిస్తితులలో హామ్ రేడియో ద్వారా సమాచారం ఒక చోట నుండి మరొకచోటికి పంపటం తేలిక. ఎందుకంటే, హామ్ రేడీయోకి ఒక ఏరియల్, ఒక చిన్న బ్యాటరీ ఉంటేచాలు. గుజరాత్ భూకంపం, ఆంధ్ర, ఒరిస్సాలలో తుపానులు వచ్చినపుడు ఉత్సాహవంతులైన హామ్‌లు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సహాయ కార్యక్రమాలలో ఎంతగానో సహకరించారు. ఇలా అందరు హామ్ లు రాలేరు కాబట్టి, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోస్తా జిల్లా కేద్రాలలో "హామ్ క్లబ్ స్టేషన్" లను ఏర్పరిచి కొంతమంది హామ్ లకు గౌరవ వేతనం ఇచ్చి ప్రొత్సహిస్తున్నది. వారికి జిల్లా కలెక్టరు కార్యాలయంలో కాని, ఆ దగ్గరలో కాని కొంత చోటూ కూడా ఇచ్చి (ఇతర సమయాలలో హామ్ రేడీయో హాబీ గురించి నలుగురికీ తెలియ చెయ్యటానికి మరియు ఆసక్తిగల వారికి హామ్ లైసెన్సు పరీక్షకు తరిఫీదు ఇవ్వటానికి) ప్రోత్సహిస్తున్నది.

ఇంటర్ నెట్ లో హామ్ రేడియో

లైసెన్సు కలిగి ఉన్న హామ్ లు, తమ వద్ద హామ్ సెట్ లేకపోయినా ఇంటర్నెట్ ద్వారా ఇతర హామ్ లతో సంభాషించవచ్చు. CQ-100,[7] ECHO-LINK [8] వంటి వెబ్ సైట్ల ద్వారా ఇది సాధ్య పడుతుంది. ఇందులో CQ-100 లో నిజానికి వైర్ లెస్ ప్రసారం ఏమీ ఉండదు, సంభాషణలు అన్నీ ఇంటర్ నేట్ ద్వారా మాత్రమే ప్రసారమవుతాయు. అంటే, మామూలు హామ్ సెట్ గల వారితో సంభాషణ కుదరదన్న మాట. మరో పక్క ECHO-LINK ద్వారా అయితే సంభాషణలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిపీటర్ల ద్వారా ప్రసారం జరుగుతాయి. మామూలు హామ్ సెట్లు గలవారు కూడా వారి సెట్లకు కొద్దిపాటి మార్పులు చేసుకొని ECHO-LINK ద్వారా ఇంటర్ నెట్ లో ఉన్న హామ్‌లతో సంభాషించవచ్చు.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో, కొత్త కొత్త సమాచార పరికరాలు వస్తునాయి. దీని మూలంగా రోజు రోజుకీ రేడియో ఫ్రీక్వెన్సీలకు గిరాకీ పెరిగిపోతున్నది. ప్రస్తుతం హామ్ ఫ్రీక్వెన్సీలను వారికి ఉచితంగా ఇచ్చి ఉన్నారు. వీటి మీద ఎవరికీ ఆదాయం వచ్చే అవకాశం లేదు. అందువల్ల, ప్రస్తుత వ్యాపార ధోరణుల దృష్ట్యా, సమీప భవిష్యత్తులో, హామ్ రేడీయో ప్రీక్వెన్సీలను వ్యాపారపరంగా పంపకం జరిగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇంకొన్ని సంవత్సరాల తరువాత చూస్తే, హామ్ రేడియో, ఇంటర్ నెట్లో మాత్రమే ఉంటుంది అని తెలిసినా, ఆశ్చర్యపడకుండా ఉండటానికి మనం సిద్ధమవ్వాలేమో!!

ఇవికూడా చూడండి


No comments:

Post a Comment