Monday, May 3, 2010

హామ్ రేడియో

వికీపీడియా నుండి

హామ్ రేడియో తయారు చేసుకుంటున్న వారి ఊహా చిత్రం
ఔత్సాహిక హామ్ తయారు చేసుకున్న హామ్ రేడియో
అంతర్జాతీయ హామ్ రేడియో చిహ్నం. ఈ చిహ్నంలోని వజ్రాకారపు ఆకృతిలో ఉన్నది ఎలక్ట్రానిక్ సర్క్యూట్
అత్యంత ఆధునికమయిన రేడియో చిత్రం. ఇది సొంత తయారీ కాదు, వ్యాపార పరంగా తయారుచేయబడినది

హామ్ రేడియో ఒక అభిరుచి. ఖాళీ సమయాలలో, ఈ హాబీలో ఆసక్తి ఉన్నవారు, తమకున్న ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తమంతట తామే ఒక రేడియో - సందేశాలు పంపగలిగే, స్వీకరించగలిగే రేడియో ట్రాన్సీవరు - తయారు చేసి, తమలాంటి ఇతరులతో ఆ రేడియో ద్వారా సంభాషించటమే ఈ అభిరుచి. ఈ అభిరుచి ప్రారంభ కాలంలో, స్వయంగా సెట్ తయారు చేసుకోగలిగేవారు మాత్రమే ఈ అభిరుచి చూపగలిగేవారు. కాలక్రమేణా తమంతట తాము సెట్ తయారు చేసుకోలేకపోయినప్పటికీ ఆసక్తి ఉన్నవారు కూడా ఇతరులు తయారు చేసిన సెట్లు లేదా మార్కెట్‌లో కొనుక్కొని ఈ అభిరుచిని కొనసాగించటం మొదలు పెట్టారు. నిజానికి ఇప్పుడు ఈ హాబీలో ఉన్నవారిలో ఎక్కువమంది (60%-70% వరకు) సెట్లు తమంతట తాము తయారు చేసుకోలేనివారే. కాని, ఏరియల్ కట్టుబాటు, వాతావరణ పరిస్థితిని బట్టి రేడియోను వాడటంలో ప్రయోగాలు చేస్తుంటారు.

No comments:

Post a Comment